![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'.. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 427 లో.. మురారిని విడిపించడానికి వచ్చిన ముకుంద ఆలోచనలో పడుతుంది. మురారికి తనే ముకంద అనే నిజం చెప్పేసినట్టు.. దానికి మురారి షాక్ అయినట్టు కల కంటుంది. ఇక స్టేషన్ లోని ఓ కానిస్టేబుల్ వచ్చి.. మేడమ్ మేడమ్ అని ముకుందని పిలవగా మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చేస్తుంది.
ఇక ఆ తర్వాత ఆ స్టేషన్ ఎస్సై రావడంతో.. మురారిని విడిపించండి అని ముకుంద అతనితో చెప్తుంది. నువ్వు చెప్తే అయిపోదు. ఇందులో పెద్దపెద్దవాళ్ళున్నారని ఎస్సై అనగానే.. ముకుంద హోమ్ మినిస్టర్ తో కాల్ చేపిస్తుంది. దాంతో మురారిని విడిచేస్తాడు. ఇక బయటకొచ్చిన మురారి ఎవరని అడుగగా.. నేను ముకుందని అంటుంది. అది విని షాక్ అవుతాడు. ఇక వెంటనే ముకుంద వాళ్ళ ఫ్రెండ్ అని, హోమ్ మినిస్టర్ కూతురు, ముకుంద, తను ఒకే కాలేజీలో చదువుకున్నామని చెప్తుంది. మరి ముకుందే సూసైడ్ నోట్ రాస్తే మీరెందుకు విడిపచారని మురారి అనగానే.. తనకి తెలియకుండా వాళ్ళ నాన్న అదంతా చేశాడని ముకుందని అపార్థం చేసుకోవద్దని తను చెప్తుంది. మీరు నాతో పాటు రండి, మా ఇంట్లో వాళ్ళు సంతోషిస్తారని మురారి అనగానే.. త్వరలోనే వస్తానని తన నెంబర్ మురారికి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇక పోలీసులు మురారిని వారింటికి తీసుకెళ్తారు. అప్పటికే రేవతి, కృష్ణ బాధపడుతుంటారు. మురారిని ఏదైనా చేస్తారేమోనని కృష్ణ అంటుండగా.. అలా ఏం జరగదని మధు అంటాడు. కాసేపటికి ఎవరో డోర్ కొడుతున్నట్టుగా అనిపించడంతో కృష్ణ వెళ్ళి డోర్ తీస్తుంది. ఇద్దరు కానిస్టేబుల్స్ కనిపించడంతో కృష్ణ షాక్ అవుతుంది. ఇక వారి వెనకాలే మురారి ఉండటంతో కృష్ణ కన్నీళ్ళతో .. ఏసీపీ సర్ అని వెళ్తుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా మురారి దగ్గరికి పరుగన వస్తారు. ఇక అక్కడికొచ్చిన ఆదర్శ్.. అదేంట్రా లాకప్ డెత్ చేస్తానని అన్నారు. అలా ఎలా వదిలేశారని వెటకారంగా మాట్లాడతాడు. ముకుంద వాళ్ళ ఫ్రెండ్ నన్ను అర్థం చేసుకొని నన్ను విడిపిస్తే.. చిన్నప్పటి నుండి నాతో పాటు పెరిగిన నువ్వేమో ఇలా ఉన్నావని ఆదర్శ్ తో మురారి అంటాడు.
అతని మాటలు పట్టించుకోకమ్మ కృష్ణ.. మురారిని లోపలికి తీసుకెళ్ళని సుమలత చెప్తుంది. దాంతో మురారిని అందరు కలిసి లోపలికి తీసుకెళ్తారు. ఇక మురారిని పోలీసులు కొట్టిన దెబ్బలను చూస్తూ రేవతి ఏడుస్తుంటుంది. కూతురు కోసం ముకుంద వాళ్ళ నాన్న అలా చేశాడని మురారి అంటాడు. అది విని రేవతి బాధపడుతుంది. ఎప్పుడో తిన్నాను .. ఆకలిగా ఉంది. అన్నం పెట్టని రేవతితో మురారి అంటాడు. అది చూసిన కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఇక తరువాయి భాగంలో భవానీతో పాటు రూపం మార్చుకున్న ముకుంద వస్తుంది. వాళ్ళని చూసిన ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |